Maha Shivaratri | శివుడిని ఎలా అభిషేకించాలి? పాలతో పూజిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? నెయ్యితోనా?
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి.
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే ‘ఈ సంపదలన్నీ నువ్వు ఇచ్చినవే స్వామీ!’ అని కృతజ్ఞత ప్రకటించడమే ఆ ద్రవ్యాలతో శివుణ్ని అభిషేకించడంలోని ఆంతర్యం. వీటిలో ఎక్కువ తక్కువలు లేవు. ఈ తర తమ భేదాలన్నీ మనం కల్పించుకున్నవే. మన దృష్టిలోనే ఈ ఎక్కువ తక్కువలు. శివుడి సృష్టిలో అన్నీ సమానమే. అతడు చూసేది మన అంతరంగంలోని నిశ్చల భక్తిని మాత్రమే.
‘శాంతి ధారా జలంబుల జలక మార్చి’ అన్నాడు శ్రీనాథ మహాకవి. అంటే, జ్ఞాన దీపం వెలుగుతూ ఉండగా, శాంతి ధారలతో అభిషేకించాలి. ‘మనసులో జ్ఞాన దీపం వెలిగితే, ఎక్కువ తక్కువలు ఉండవు. స్వ పర భేదాలు కూడా ఉండవు. రాగద్వేషాలకూ, అహంకార మమకారాలకూ అతీతమైన ఒక ప్రశాంతత హృదయంలో నెలకొని ఉంటుంది. ఈ ప్రశాంతతే శివాభిషేకానికి తగిన శ్రేష్ఠమైన పదార్థం. ప్రపంచమంతా శివమయం అని, అందరూ తనవారేనని, తానేనని, సృష్టి అంతా ఒక్కటేననీ పవిత్ర భావాలను శివుడికి పూజా పుష్పాలుగా సమర్పించే ప్రయత్నం చేయాలి. పూజలో మనం సమర్పించే పూలు స్వచ్ఛంగా, పరిమళ భరితంగా, పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా! ఆ పూలు మన భావాలే అయినప్పుడు ఆ మనసు నిష్కల్మషంగా, పవిత్రభావ పరిమళాలతో నిండి ఉండాలి. అలాంటి దీపారాధన, అభిషేకం, అర్చన జరుగుతూ ఉంటే, ‘అతి విశుద్ధ మనోవృత్తి’ సిద్ధిస్తుంది. ఈ స్థితిని అనుభవానికి తెచ్చుకోవటానికి మనం చేసే దీపారాధన, అభిషేకం, పుష్పార్చన దోహదం కావాలన్నదే శ్రీనాథ కవి ఆశయం.
.. శ్రీమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

