అతను శివం, ఆమె శక్తి. అతను సర్వేశ్వరుడు, ఆమె సర్వమంగళ. అతను మాట, అమె అర్థం. అతను జాడ, ఆమె నీడ. ఆమె పట్టు, అతను విడుపు.
అతను పుట్టుకలేనివాడు. ఆమె ప్రతి పుట్టుకా ఓ మహాపురాణమే. ఆమె సగం, ఆయన సగం.. ఇద్దరూ కలిస్తే జగం! అందుకేనేమో.. శివరాత్రినాడు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఘనంగా జరిపిస్తారు.