హనుమంతుడు దేవదూత. రామాయణంలో హనుమ పాత్ర చాలా ప్రత్యేకమైంది. దేవదూతలు అసత్యాన్ని సహించరు. మోసాన్ని భరించరు. సత్యమే వారి జీవన పరమావధి. సత్యాన్ని సంరక్షించడానికి ఎంత స్థాయికైనా వెళ్తారు. మానవాళి సమస్యలను పరిష్కరించడానికే భూమి మీద అవతరిస్తారు. హనుమ కూడా అంతే. వాయుపుత్రుడు మహా బలవంతుడు. శ్రీమహావిష్ణువు అవతారమైన రామచంద్రుడి దూతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే త్రేతాయుగంలో వానరమై అవతరించాడు. సీతా మాత జాడ కనిపెట్టాడు. లంకకు నిప్పు పెట్టాడు. మహామహా రాక్షసులను సంహరించాడు. సంజీవని తెచ్చి లక్ష్మణుడిని బతికించాడు. రావణ సంహారంలో తనవంతు పాత్ర పోషించాడు.
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత.. సీతమ్మవారు తనకు ప్రసాదించిన ముత్యాలహారాన్ని తెంచేసి.. అందులోని ప్రతి ముత్యంలో రాముడిని అన్వేషిస్తాడు. ‘రామస్వామి జాడలేని ఈ హారం ఎంత ఖరీదైనది అయినా నాకెందుకు?’ అంటూ భౌతిక విషయాల పట్ల తన నిరాసక్తతను వెల్లడిస్తాడు. హనుమ బుద్ధిమంతుడే కాదు, అణిమాది అష్ట సిద్ధులనూ గెలిచిన మహా సాధకుడు కూడా. సహజ యోగ ద్వారా కూడా వీటిని సొంతం చేసుకోవచ్చు. ఆ ప్రాంతానికి అధిదేవుడైన హనుమ కటాక్షమూ పొందవచ్చు.
– శ్రీ మాతాజీ నిర్మలా దేవి, సహజయోగ సృష్టికర్త