జీవితం.. వర్ణ శోభితం
భారతీయ సంస్కృతిలో పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రకృతిలో మార్పులను బట్టి వేరువేరు పండుగలు నిర్దేశించారు పెద్దలు. ఆయా పండుగల నిర్వహణ ద్వారా వ్యక్తి శక్తిగా, మానవుడు మహనీయుడుగా మారగలిగే అవకాశం ఉంది.
భారతీయ సంస్కృతిలో పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రకృతిలో మార్పులను బట్టి వేరువేరు పండుగలు నిర్దేశించారు పెద్దలు. ఆయా పండుగల నిర్వహణ ద్వారా వ్యక్తి శక్తిగా, మానవుడు మహనీయుడుగా మారగలిగే అవకాశం ఉంది. సుఖ సంతోషాలను పెంచుకోవడం, శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవడం ద్వారా సమాజానికి మరింత అంకితభావంతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆనంద ప్రధానమైన పండుగల్లో హోలీ ఒకటి. మూలాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ పండుగలో మౌలికంగా ఎన్నో అంశాలు కనిపిస్తాయి.
సూర్యుడి తెల్లని కాంతి నుంచి ఎన్నో రంగులు మనకు వెలువడుతున్నా, ఈ భూమి మీద ఉన్న వాతావరణం రీత్యా ఏడు ముఖ్యమైన వర్ణాలు కనిపిస్తుంటాయి. అందుకే ఆదిత్యుడిని ‘సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం’ అని స్తుతించారు. ఏడు వర్ణాల కలయికతో ఇతర రంగులూ ఏర్పడతాయి. వీటన్నికీ మూలం సూర్యుడే! చలి పూర్తిగా తగ్గి వేడి పెరుగుతున్న ఈ సమయంలో ఈ రంగుల హరివిల్లు కూడా శరీరానికి, మనస్సుకు సంతోషాన్నిస్తుంది. చిన్న పెద్ద, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ పాల్గొని, అందరూ ఆనందించే పండుగ హోలీ.

మనం చల్లుకునే రంగుల్లో కూడా అనేక మార్పులుంటాయి. ఆయా రంగుల ప్రత్యేకతలు శరీరానికి కూడా మేలు చేస్తాయి. సాధారణంగా గ్రహాల అనుగ్రహం కోసం మనం నిత్యం ప్రయత్నిస్తుంటాం. ఆ గ్రహాలపైనున్న వాతావరణం వల్ల వేరువేరు రంగుల ప్రభావాలను ఈ భూ వాతావరణంపైకి వెద జల్లుతుంటాయి. అదేవిధంగా మన చుట్టూ ఉండే వర్ణాలకు మనం కూడా స్పందించే విధానం వేరుగా ఉంటుంది. కొన్ని రంగులు భయాన్ని పెంచితే, కొన్ని కోరికలను పెంచుతాయి. కొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆలోచనాత్మకాలవుతాయి. అందుకే దేవతలకు కూడా ఎన్నో వర్ణాలను పెట్టి చూసుకోవడం మన సంప్రదాయం. గ్రహాలలో సూర్యుడికి నారింజ, చంద్రుడికి సాధారణ తెలుపు, కుజునికి ఎరుపు, బుధునికి ఆకుపచ్చ, గురునికి పసుపు పచ్చ, శుక్రునికి మెరిసే తెలుపు, శనికి నీలవర్ణం, రాహువుకు బూడిద వర్ణం, కేతువుకు చిత్రవర్ణంతో కూడుకున్న రంగులు ప్రాధాన్యం వహిస్తున్నాయి.
మనం నిత్యం పసుపు రంగును అధికంగా ఉపయోగిస్తాం. పసుపు మనిషిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. వ్యతిరేకతలను తొలగిస్తుంది. ఎరుపు రంగు వ్యక్తిలో భయం కలిగిస్తుంది. అపాయమనే సంకేతం తెలపడానికి ఎరుపు వినియోగిస్తాం. ఆకుపచ్చ వర్ణం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తెల్లటి తెలుపు జ్ఞానానికి సంకేతం. సరస్వతీ దేవి సూర్యుడి వెలుగుల ప్రోది. నారింజ రంగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. దానికి సమంగానే గులాబి రంగు కూడా ఉంటుంది. నీలవర్ణం విశ్రాంతిని పెంచితే, మందమైన తెలుపు వర్ణం ఆకలి కలిగిస్తుంది. ఇలా వివిధ రంగులు మనకు వేర్వేరు భావాలను కలిగిస్తుంటాయి. ఈ భావాలను అనుసరించి ఇండ్లలో గోడలకు రకరకాల రంగులు వేసుకుంటాం.
ఇంతటి ప్రత్యేకతలు ఉన్న రంగులు మన శరీరంపై పడితే, దానిపై సూర్యకిరణాలు సోకి ఆ ప్రభావం మనకు చేరుతూ ఉంటుంది. ఈ హోలీ పండుగలోని రంగుల విజ్ఞానమిదే. ఈ రంగుల హరివిల్లును దర్శించడం వెనుక ఉండే ఆరోగ్య సూత్రాలివే. పరిమితులు దాటని ఆటపాటలతో హాయిగా రంగులను చల్లుకుంటూ, ఆనందోత్సాహాలను పెంచుకుంటూ, వసంతాన్ని స్వాగతిస్తూ, కొత్త సంవత్సరాన్ని పలకరిస్తూ, మనల్ని మళ్లీ పునర్జీవితులుగా, సమాజానికి పునరంకితం చేసే పండుగ హోలీ. ఈ రంగుల ఇంద్రధనుస్సులో పాల్గొని మనమూ ఉత్సాహంగా జరుపుకొందాం.
కామదహనం
హోలీకి ముందురోజు రాత్రి కోలాటాలు ఆడిన కర్రలను, ఇతర కర్రలను కూడళ్లలో వేసి రాత్రి సమయంలో పున్నమి వెన్నెలలో దహనం చేసే సంప్రదాయం ఉంది. మన మనస్సు ఎన్నో తలపులతో, సంకల్పాలతో, భావనలతో, కోరికలతో కూడుకొని ఉంటుంది కాబట్టి, ఆ కోరికలన్నిటినీ జ్ఞానంతో దహించాలి. ‘జ్ఞానాగ్నిః దగ్ధ కర్మాణి’ అంటుంది భగవద్గీత. ఆ కోరికలను తొలగించుకోవడమే ‘కామదహనం’.
హోలికా దహనం
హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక. ప్రహ్లాదుడిని చంపాలని ఆ బాలకుణ్ని ఒడిలో ఉంచుకొని అగ్ని ప్రవేశం చేస్తుంది. ప్రహ్లాదుడు బతుకుతాడు. హోలిక మంటల్లో కాలిపోతుంది. ఆ ఘట్టానికి ప్రతీకగా హోలికా దహనం నిర్వహించడం మరో సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో హోలికా రాక్షసి ప్రతిరూపాన్ని కాల్చివేస్తూ ఉంటారు.
…? సాగి కమలాకర శర్మ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

