అందరూ అల్లాహ్ అతిథులే!
హజ్ యాత్ర సమానత్వానికి ప్రతీక. రాజు-సేవకుడు, ధనిక- పేద తేడాలు ఇక్కడ ఉండవు. అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే. వేసుకునే దుస్తుల రంగు ఒకటే.. తెలుపు! నినాదం ఒకటే.. ‘అల్లాహు అక్బర్'. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేపట్టాలని భావిస్తారు ముస్లింలు.
హజ్ యాత్ర సమానత్వానికి ప్రతీక. రాజు-సేవకుడు, ధనిక- పేద తేడాలు ఇక్కడ ఉండవు. అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే. వేసుకునే దుస్తుల రంగు ఒకటే.. తెలుపు! నినాదం ఒకటే.. ‘అల్లాహు అక్బర్’. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేపట్టాలని భావిస్తారు ముస్లింలు. ఈ మేరకు ఏటా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది విశ్వాసులు కాబా గృహానికి చేరుకుంటారు. ఐదు రోజుల యాత్రలో ఎలాంటి భేషజాలకూ పోకుండా, ఎంతో నిరాడంబరంగా అల్లాహ్ నామస్మరణలో గడుపుతారు. ఒకరోజు ఉపవాసాన్ని పాటించడం, మరో రోజు ఖుర్బానీ చేయడం, కాబా ప్రదక్షిణలు, సఫా మర్వా కొండల మధ్య తిరగడం, అరఫాత్ మైదానంలో విడిది చేయడం లాంటివన్నీ హజ్ యాత్రలో క్రతువులు. స్తోమత గల ప్రతీ ముస్లిం హజ్ యాత్ర చేయడం విధి. ఇస్లామ్ ఐదు మూల స్తంభాల్లో హజ్ ఒకటి. ధర్మబద్ధంగా, నిజాయతీగా సంపాదించిన డబ్బుతోనే ఈ యాత్ర చేయాలన్నది ప్రవక్త ఉద్బోధ. ‘ఎవరైతే ఎలాంటి అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థ విషయాలకు పాల్పడకుండా, దైవ అవిధేయతకు ఒడిగట్టకుండా జాగ్రత్తపడుతూ హజ్ చేస్తాడో అతను ఆ రోజే తల్లి గర్భం నుంచి పుట్టినవానిలా పరమ పవిత్రంగా తిరిగి వస్తాడు’ అని ముహమ్మద్ ప్రవక్త (సఅసం) ఉపదేశం. చిన్నా, పెద్ద, యువకులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరైనా హజ్ యాత్రకు వెళ్లవచ్చు. వయోభేదం, లింగభేదం లేదు. హజ్ యాత్రకు వెళ్లేవారంతా అల్లాహ్ అతిథులు.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

