ప్రతి మనిషిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. చెడును విడిచిపెట్టి, మంచిని పెంపొందించుకోవడమే మన పని. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో మనం ఉపయోగించే చాట, జల్లెడను ఆదర్శంగా తీసుకోవచ్చు. చాటలో బియ్యం చెరిగినప్పుడు అది అందులోని నూక, మట్టి బెడ్డలను అవతలికి తోసివేస్తుంది. చెత్తనంతా తొలగించి మంచి బియ్యాన్ని మనకు అందిస్తుంది.
అదే జల్లెడ విషయానికి వస్తే దీనికి పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. పిండి జల్లెడ పట్టినప్పుడు మంచి పదార్థం కింద పడుతుంది. జల్లెడలో చెత్త మిగులుతుంది. చెడును నిర్మూలించే క్రమంలో చాటను ఆదర్శంగా తీసుకోవాలి. మనలోని చెడును తరిమేస్తే ఉండేది మంచే కదా! మంచిని పోగొట్టుకుంటే జల్లెడలోని చెత్తలా మనిషి కూడా అయోగ్యుడిగా మిగిలిపోతాడు.
…?విద్యాప్రకాశానందగిరి