చేసిన ధర్మం చెప్పొద్దు
అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది.
“ఒక రాతి కొండపై మట్టి పొర ఉంది.
భారీ వర్షం పడితే.. దానిపై ఉన్న మట్టంతా కొట్టుకుపోయి రాయి మాత్రమే మిగిలిపోతుంది.
అలాగే ఇతరుల మెప్పు కోసం దానం చేస్తున్నామని భావించే వారి పుణ్యకార్యం వల్ల కూడా ఏ ప్రయోజనం కలుగదు.” (దివ్య ఖురాన్ 2-265)
అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది. సన్నని జల్లులు పడ్డా తగిన ఫలం దక్కుతుంది. నిజాయతీతో సంపాదించిన ధనాన్ని కుటుంబ అవసరాలకు పోగా, మిగిలినది దైవ మార్గంలో ఖర్చు చేయాలని ఖురాన్ సూచిస్తుంది. నిరుపేదలు, బంధువులు, అన్నార్తులను ఆదుకోవడాన్ని అల్లాహ్ మార్గంలో చేసే ఖర్చుగా అభివర్ణిస్తారు ముహమ్మద్ ప్రవక్త (స). ఆయన మార్గంలో ఖర్చు చేసే ఒక్క రూపాయి ఏడువందల రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. అయితే, దానం చేసే సొమ్ము సక్రమ మార్గంలో సంపాదించిందై ఉండాలని ఖురాన్ ఉద్బోధ. దానం చేసి చులకనగా చూడటం, కృతజ్ఞత ఆశించడం, ప్రచారం చేసుకోవడం వల్ల ఆ ఫలితం వృథా అవుతుంది.
జకాత్.. ఫిత్రా.. సదఖా..
ముస్లింలు దానధర్మాలను జకాత్, సదఖా, ఫిత్రా పద్దుల్లో ఖర్చుపెడతారు. ఏడాదిపాటు తమ దగ్గర ఉన్న సంపదలోంచి రెండున్నర శాతం తీసి అభాగ్యులు, అనాథలకు అందించడాన్ని జకాత్ అంటారు. జకాత్ అంటే శుద్ధి చేయడం. జకాత్ ఇవ్వడం అంటే సంపదను శుద్ధి చేసుకోవడం అన్నమాట. గుర్తుంచుకోవలసిన వాస్తవం ఏమిటంటే, కేవలం ధర్మసమ్మతమైన పద్ధతుల్లో సంపాదించిన సంపద మాత్రమే జకాత్ వల్ల శుద్ధమవుతుంది. అధర్మంగా సంపాదించింది దానం చేసినంత మాత్రాన ఏ ఫలితమూ రాదు. అలాంటివారికి దైవ సన్నిధిలో శిక్ష తప్పదు అంటుంది ఖురాన్.
రంజాన్ పండుగకు ముందు చేసేది ఫిత్రా. ఇది ప్రతీ ముస్లిం విధిగా చేయాలి. స్థితిమంతులైన ముస్లింలు ఈ పవిత్ర మాసంలో కిలోన్నర గోధుమలకు సరిపడా డబ్బును పంపిణీ చేస్తేనే.. వారి ఉపవాసాలను దైవం స్వీకరిస్తాడని ప్రవక్త ప్రవచించారు. సంపదలో కొంతమొత్తాన్ని నిరుపేదలకు పంచాలన్నది సదఖా ఉద్దేశం. కష్టార్జితంతో సంపాదించిన చిన్న ఖర్జూరపు ముక్కనైనా సదఖా (దానం) చేయండి అని ప్రవక్త (స) చెప్పారు. అలా చేసిన ఖర్జూరపు ముక్కను అల్లాహ్ స్వయంగా తన కుడిచేతిలో తీసుకుని దాన్ని పెంచి పోషిస్తాడు. అల్లాహ్ మన దాన పరిమాణాన్ని చూడడు, మన ఆంతర్యాలను, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. సత్సంకల్పంతో చేసే గోరంత దానం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల మెప్పు కోసం చేసే కొండంత దానం కూడా రవ్వంత ప్రయోజనాన్ని చేకూర్చదు అని గుర్తెరగాలి!
…? ముహమ్మద్ ముజాహిద్ 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

