సిద్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధ్ధిదా సిద్ధిదాయినీ॥
నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాత్రిగా అనుగ్రహిస్తుంది. కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది. సకల అభీష్టాలనూ నెరవేర్చే దేవత సింహ వాహనంపై దర్శనమిస్తుంది. సాక్షాత్తూ శివుడికే సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిదాత్రి. ఈ తల్లిని కొలిచిన వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. లౌకిక, అలౌకిక సిద్ధులూ సిద్ధిస్తాయి. ఇహ సుఖాలను ఇస్తూనే జ్ఞానాన్నీ, మోక్షాన్నీ అనుగ్రహిస్తుందీ దేవత. సిద్ధిదాయిని కటాక్షం పొందినవారికి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య మొదలైన పద్దెనిమిది సిద్ధులూ కరతలామలకం అవుతాయని బ్రహ్మవైవర్త పురాణం చెబుతున్నది. పరమేశ్వరుడు సైతం ఈ సిద్ధిదాత్రి అనుగ్రహంతో సర్వ సిద్ధులను పొందాడట.
నైవేద్యం: పాయసాన్నం, మధురఫలాలు
బాసర ఒక్కటే కాదు.. తెలంగాణలో ఉన్న ఈ సరస్వతీ దేవాలయాల గురించి తెలుసా !!”
“దసరాకు ఏ రాష్ట్రం ఎన్ని రోజులు సెలవులు ఇస్తుందో తెలుసా!!”
ముంబై, కోల్కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?