ప్రభువు పుట్టుకలో..
క్రీస్తు కేవలం యూదా గోత్రంలోని దావీదు మహరాజ వారసుడు మాత్రమే కాదు, ఈ విశ్వాన్నీ పాలించే విశ్వ విభుడైన ప్రభువు అని క్రైస్తవ లోకం విశ్వాసం. అయితే ఆయన మళ్లీ ప్రభువుగానే ఓ రాజవంశంలో పుట్టొచ్చుగా, అలా కాకుండా మామూలు మనిషిగా రావడానికి కారణాలేమిటి? అని ఒకసారి సమీక్షించుకుంటే..
- క్రీస్తు సందేశం
క్రీస్తు కేవలం యూదా గోత్రంలోని దావీదు మహరాజ వారసుడు మాత్రమే కాదు, ఈ విశ్వాన్నీ పాలించే విశ్వ విభుడైన ప్రభువు అని క్రైస్తవ లోకం విశ్వాసం. అయితే ఆయన మళ్లీ ప్రభువుగానే ఓ రాజవంశంలో పుట్టొచ్చుగా, అలా కాకుండా మామూలు మనిషిగా రావడానికి కారణాలేమిటి? అని ఒకసారి సమీక్షించుకుంటే.. అహంకారంతో విర్రవీగుతూ హుంకరించే డాంబికుల పటాటోపాలన్నీ పటాపంచలైపోతాయి. తమకు ఈ మానవ జన్మ లభించినందుకు ఈ లోకంలో ఏదైనా మంచి పనిచేసి వెళ్లిపోదామన్న కనువిప్పు కలుగుతుంది. ఔను! మనిషి ఎంత ఉన్నతుడై మెలగినా ఓ మెట్టు దిగాల్సిన సందర్భం వస్తే.. దిగాలి. కొందరు ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా.. కొన్నిసార్లు సాదాసీదా సామాన్యులతో కలిసిపోతూ తమ ఔన్నత్యాన్ని చాటుకుంటారు.
పాకలో పశువుల మధ్య దీనమైన స్థానంలో ప్రభువు జన్మించడానికి కారణం.. మనిషికి అణకువ నేర్పడానికే! రాజవంశం కాదని మామూలు వ్యక్తులకు కుమారునిగా పుట్టడానికి కారణం జాతకం స్థలంలో కాదు, చేసే చేతల్లో ఉందని చెప్పడానికే!! క్రీస్తు అతి సాధారణ జననం.. ఎందరో మహనీయులకు ఉత్ప్రేరణ కలిగించింది. అందుకే ఈ ఎంపిక! సామాన్యులైన తల్లిదండ్రులు, నిండు నెలలతో నొప్పుల బాధ భరించలేని గర్భవతికి కూడా చోటు ఇవ్వని ఈసడింపుల సమాజం, దుర్భర చీకటి.. ఈ స్థితులన్నిటినీ చీల్చుకొంటూ పైకి ఉబికిన కాంతిపుంజమే ప్రభువు. ఇవన్నీ మనిషికి మహోన్నత గుణాలు నేర్పడానికే అని మనం గుర్తించాలి.
ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

