సాధనాయణం.. దక్షిణాయనం
కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన రుషులు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. నిజానికి రాశి చక్రంలో దక్షిణాయనం ముందుగా వస్తుంది.
కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన రుషులు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. నిజానికి రాశి చక్రంలో దక్షిణాయనం ముందుగా వస్తుంది. దానికి కారణం ‘భ’ చక్రంలో ఉత్తరాయణం మొదలయ్యే మకర రాశి కన్నా, దక్షిణాయనం ప్రారంభమయ్యే కర్కాటకం ముందుగా ఉండటమే! కానీ, మానవ కార్యాలకు ఉత్తరాయణం విశేషమైనది అని పెద్దలు పేర్కొన్నారు. పితృదేవతల ఆరాధనకు దక్షిణాయనం ప్రత్యేకం. ఈ కారణంగా ఉత్తరాయణాన్ని తొలిగా పేర్కొన్నారు. పండుగలకు, ఉత్సవాలకు నెలవైన దక్షిణాయనం ఆధ్యాత్మిక సాధనకు వేదికగా నిలుస్తుంది.
ఉత్తరాయణం పుణ్యకాలమనీ, దక్షిణాయనం అంటే మామూలు సమయం అనే అపోహ చాలామందిలో ఉంది. శాస్త్ర ప్రకారం అన్ని కాలాలూ యోగ్యమైనవే! అన్నీ ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనవే. ఉత్తరాయణం శుభకార్యాలకు అనువైనదైతే.. దక్షిణాయనం ఉపాసకులు అనుష్ఠానం చేసుకోవడానికి విశేషమైనదిగా చెబుతారు. ఉత్తరాయణంలో శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, నృసింహజయంతి తదితర పర్వాలు పలకరిస్తే.. దక్షిణాయనంలో వివిధ దేవతా ఉపాసనలు, అనుష్ఠానాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగటి సమయమనీ, దక్షిణాయనం రాత్రి సమయమనీ చెబుతారు. దేవతలకు రాత్రి సమయం కావడంతో ఆసురీ శక్తుల ప్రభావం అధికమవుతుంది. దానిని ఎదుర్కోవడానికి ఈ ఆరునెలల కాలంలో వివిధ దేవత ఉపాసనలు ఉండేలా మన పూర్వికులు నిర్దేశించారు.
ప్రతి నెలా ప్రత్యేకమే
దక్షిణాయనంలో వచ్చే శ్రావణ మాసంలో శివుడు, మంగళగౌరీ, వరలక్ష్మీ దేవి ఆరాధన ఊరూరా పండుగలా సాగుతుంది. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులతో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా రుణత్రయాల్లో ఒకటైన పితృరుణ విముక్తికి భాద్రపద కృష్ణ పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృ తర్పణాలు నిర్వహించడం సంప్రదాయం. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు శక్తి ఉపాసనకు దోహదం చేస్తాయి. మన రాష్ట్రంలో జగన్మాతను పూలతో బతుకమ్మగా పేర్చి పదిరోజులపాటు ఆటపాటలతో ఆరాధిస్తారు. ఆశ్వయుజ అమావాస్య నాటి దీపావళి పండుగ లక్ష్మీదేవి ఆరాధనకు ప్రశస్తమైనది. శివ, కేశవుల ఆరాధనతో కార్తిక మాసం ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. హరి మాసంగా పేర్కొనే మార్గశిరం విష్ణు ఉపాసనకు విశేష సమయం. సౌర, చాంద్ర మానాల గమనాల ఆధారంగా ఆషాఢం, పుష్య మాసాలు దక్షిణ, ఉత్తర అయనాల సంధి మాసాలుగా పలకరిస్తాయి.
మన కోసమే..
ఉత్తరాయణంలో మార్తాండుడి తేజస్సు మానవాళిపై విస్తారంగా ప్రసరిస్తుంది. దక్షిణాయనం మొదలైన నాటి నుంచీ భాస్కరుడి ప్రభ నానాటికీ తగ్గుతూ వస్తుంది. వానలు, చలి రెండూ మనపై ప్రభావం చూపే సమయం ఇది. ఈ కాలంలో ఆరోగ్య భంగం వాటిల్లకుండా ప్రతి నెలా పలు వ్రతాలు, పూజలు నిర్దేశించారు మన రుషులు. వ్రత నియమాలు, పూజా విధానాలు, నివేదించే పదార్థాలు ఇలా ప్రతి అంశమూ మనలో రోగనిరోధక శక్తిని పెంచేలా నిర్దేశించారు.
…? విష్ణువర్ధన్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

