శ్రీశైలం చేరుకున్న బంగారు బోనం

శ్రీశైలం : తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ బోనాల పండుగలో భాగంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి గురువారం రాత్రి శ్రీశైలం చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మెన్ మాట్లాడుతూ.. మహంకాళి దేవాలయ 113వ వార్షికోత్సవం సందర్భంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కో క్షేత్రాన్ని ఒక్కొక్క సంవత్సరం దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించేందుకు శ్రీకారం చుట్టినట్లుగా పేర్కొన్నారు.
అందులో భాగంగా గురువారం సాయంత్రం లాల్‌దర్వాజ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తొలి బంగారు బోనం శ్రీశైలాంబికకు సమర్పించేందుకు వచ్చినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి ఆలయ సాంప్రదాయాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించనున్నట్లు తెలిపారు. శ్రీశైలం వచ్చిన వారిలో ఆలయ కమిటీ సలహాదారు జి. మహేష్ గౌడ్, కే.విష్ణుగౌడ్, జే. లక్ష్మినారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి బి. మారుతి యాదవ్, కొశాధికారి జి. అరవిందకుమార్ గౌడ్, చంద్రకుమార్, సురేష్ బాబు ఉన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

