చాతుర్మాస్యం అంటే..
చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? సన్యాసులు ఈ సమయంలో పొలిమేర దాటకూడదని అంటారు ఎందుకు? -నిరంజన్, కామారెడ్డి
చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? సన్యాసులు ఈ సమయంలో పొలిమేర దాటకూడదని అంటారు ఎందుకు?
-నిరంజన్, కామారెడ్డి
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. శయన ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ద్వాదశి వరకు గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఈ వ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ప్రస్తుత కాలంలో సన్యాసులు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. అరుదుగా గృహస్థులు కూడా ఈ వ్రతదీక్షలో ఉంటున్నారు.
ఒకే పూట భోజనం, బ్రహ్మచర్యం, భూతల శయనం వంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఊరి పొలిమేరలు కూడా దాటకూడదు. చాతుర్మాస్య వ్రతం మానవ జీవనశైలిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుంది. ఆషాఢం నుంచి కార్తికం వరకు ప్రకృతిలో పలు మార్పులు జరుగుతుంటాయి. వర్షాలు కురిసి వాగులూ, వంకలూ నిండుగా ప్రవహిస్తుంటాయి. రకరకాల మొక్కలు పెరిగి పరిసరాలు చీదుగా తయారవుతాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఈ కాలంలో ఎక్కువ. అందుకే, పరిసరాల మార్పు వల్ల కలిగే సమస్యలను నివారించడానికి గ్రామ పొలిమేరను దాటకూడదని శాస్త్రం నిర్దేశించింది. ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస్య వ్రతం ఏర్పాటు చేశారని పెద్దలు చెబుతారు. సన్యాసులు ఈ నాలుగు నెలలూ ఒకేచోట దీక్షగా వ్రతం ఆచరిస్తారు. కఠిన నియమాలు పాటిస్తూ ధ్యానమగ్నులై ఉంటారు.
…? శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

