సనాతన ధర్మానికి సమున్నత సాక్ష్యం
సనాతన ధర్మానికి తల్లి వేర్లు అయిన వేదాలు, ఉపనిషత్తులు ప్రబోధించిన సత్యాలకు పరమహంస ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు.
ఒకసారి రామకృష్ణ మఠం సాధువుల గోష్ఠిలో ఓ స్వామీజీ ‘రేపటి నుంచి ఉపనిషత్తులపై తరగతులు తీసుకోవాలని అనుకుంటున్నాను’ అన్నారు. ఆ మాటలు వినగానే అక్కడే ఉన్న రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యులు స్వామి ప్రేమానంద ‘సకల ఉపనిషత్తులకు సజీవభాష్యంగా విరాజిల్లుతున్న మన గురుదేవుడైన రామకృష్ణులు ఉండగా, మరి ఏ ఉపనిషత్తుల గురించి బోధిస్తారు? సకల శాస్ర్తాల సారమే వారి జీవితం’ అని ఉద్ఘాటించారు.
సనాతన ధర్మానికి తల్లి వేర్లు అయిన వేదాలు, ఉపనిషత్తులు ప్రబోధించిన సత్యాలకు పరమహంస ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. కేవలం శిష్యులకు బోధించటం కాకుండా ఆయన తన జీవితంలో అడుగడుగునా ఆచరించి చూపారు. మనలో నిగూఢంగా ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరింపజేసుకోవడమే మానవ జీవిత లక్ష్యమని వేదాలు ఘోషిస్తున్నాయి. పరమహంస కూడా మానవజీవిత పరమోన్నత లక్ష్యం భగవంతుడి దర్శనం అని ప్రబోధించారు. స్వయంగా ఆ పరమాత్మను కాళీమాత రూపంలో దర్శించారు. తన ప్రత్యక్ష శిష్యులకు దర్శింపజేశారు. ఆ అనుభూతిని పొందిన వారిలో స్వామి వివేకానంద అగ్రగణ్యులు! అందుకే తమ గురువరేణ్యులను శ్లాఘిస్తూ కాలాంతరంలో ‘వేదవేదాంతాలలో బోధించిన సత్యాలను నా గురుదేవులు తమ జీవితంలో అనుష్ఠించి, సకలశాస్ర్తాలకు సజీవభాష్యమై నిలిచారు. ఆ పరమహంసను అధ్యయనం చేయకుండా వేదాలు, ఉపనిషత్తులు, భాగవతాది పురాణాలను అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.
అన్ని మార్గాలు అనుసరించి
పరమహంసలో ఉన్న మరో ప్రత్యేకత అన్ని మతాలను ఆమోదించటమే కాదు అనుష్ఠించటం కూడా! హిందూమతంలోని వైష్ణవ తాంత్రిక సాధనల్ని ఆచరించటంతోపాటు ఇతర మతసాధనలు కూడా అనుష్ఠించి, ‘భగవంతుడు ఒక్కడే! ఆయనను చేరుకునే మార్గాలు అనేకం’ అంటూ సర్వమత సమన్వయాన్ని చాటారు. అంతేకాదు ప్రత్యక్షంగా ఆనాడు, పరోక్షంగా ఈనాడు మతాలకు సంబంధం లేకుండా లక్షల మంది ఆయన ఆధ్యాత్మిక ఛత్రంలో సేదతీరుతున్నారు. తమ పారమార్థిక సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అందుకే ఆమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ‘పరమహంసను అర్థం చేసుకుంటే, అన్ని మతాలనూ అర్థం చేసుకున్నట్లే’ అని విస్పష్టం చేశారు.
జీవారాధనే శివారాధన
ప్రతిజీవీ ఆ భగవంతుడి ప్రతిరూపమే అనే సత్యాన్ని ఏ మతాచార్యుడూ ధిక్కరించలేదు. పరమహంస ఈ సత్యాన్ని తమ జీవితంలో ఎన్నోమార్లు నిరూపించి చూపారు. స్వయంగా తీర్థయాత్రల్ని వాయిదా వేసుకొని, ఆ ఖర్చుతో దీనుల, అభాగ్యుల సేవలో నిమగ్నమయ్యారు. గుర్రపు బండిపై ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, బండి తోలే వ్యక్తి గుర్రాన్ని గట్టిగా కొడితే, తన దేహానికి గాయమైనంతగా చలించిపోయారు. అలా అన్ని ఆత్మల్ని తన ప్రతిరూపాలుగా చూసుకొని మమేకమైన మహనీయుడు ఆయన. ‘ఈ ప్రపంచం భగవన్మందిరం. అందులో ప్రతిజీవీ భగవత్ స్వరూపమని భావించి సేవించాలి. అప్పుడు జీవారాధనే శివారాధన అవుతుంది. ఇతరులను ఔదార్యం, సానుభూతి, ప్రేమతో నిస్వార్థంగా సేవించటం భగవంతుడిని ప్రాప్తించుకోవటానికి దోహదపడుతుంది’ అనేవారు రామకృష్ణులు.
పూర్వవైభవం
రామకృష్ణ పరమహంస అవతరించేసరికి మత, వర్గ భేదాలతో అభాసుపాలవుతున్న భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రం, ఆయన అసాధారణమైన ఆధ్యాత్మిక బోధనలతో పూర్వవైభవాన్ని సంతరించుకుంది. శ్రీరామకృష్ణులు వేదాలను, సత్యాలను తాను అనుభూతి చెందడమే కాక, ఇతరులతో కూడా ఆ సత్యాలను ఆవిష్కరింపచేయగల ఆధ్యాత్మిక శక్తి సముద్రం. సంచార దేవాలయంగా భాసించిన ఆ జగద్గురువు సకల మతాల సారానికి నిలువెత్తు నిదర్శనం.
…? మనోజ్ఞ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

