YouTuber | సీసీటీవీ కెమెరాను హ్యాక్ చేసి యూట్యూబర్ వ్యక్తిగత వీడియో బట్టబయలు
ఓ యువ యూట్యూబర్ (YouTuber) ప్రైవేట్ జీవితానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఆన్లైన్లో లీక్ అవడం కలకలం రేపింది. ముంబైకి చెందిన 21 ఏండ్ల యూట్యూబర్ ఈ ఘటనలో బాధితుడిగా మారాడు.
ముంబై : ఓ యువ యూట్యూబర్ (YouTuber) ప్రైవేట్ జీవితానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఆన్లైన్లో లీక్ అవడం కలకలం రేపింది. ముంబైకి చెందిన 21 ఏండ్ల యూట్యూబర్ ఈ ఘటనలో బాధితుడిగా మారాడు. అతడి సీసీటీవీ హ్యాక్ అయిన అనంతరం ప్రైవేట్ జీవితానికి సంబంధించిన క్షణాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఘటనలు ప్రైవసీపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నవంబర్ 17న బాంద్రాకు చెందిన యువ ట్యూబర్ సీసీటీవీ కెమెరా హ్యాకయింది.
ఈస్పోర్ట్స్ ప్లేయర్ కూడా అయిన యూట్యూబర్ ఇటీవల బాత్రూం నుంచి బయటకు రాగానే అతడికి తెలియకుండానే సీసీటీవీని వాడుతూ అభ్యంతరకర దృశ్యాలు రికార్డయ్యాయి. ఆపై ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో డిసెంబర్ 10న ఈ విషయం యూట్యూబర్ దృష్టికి రాగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యూట్యూబర్ బెడ్రూంలోని సీసీటీవీ కెమెరాతో హ్యాకర్ ఎలా యాక్సెస్ అయ్యాడనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యూట్యూబర్ సీసీటీవీ హ్యాక్ కావడంతో అతడి ప్రైవేట్ జీవితానికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రాం, టెలిగ్రాం, ఇతర సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా షేర్ చేశారు.
Read More :
Brazilian Singer | లైవ్ ప్రదర్శన ఇస్తూ.. స్టేజ్పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సింగర్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

