Cyber Fraud | ఆధార్-సిమ్ కార్డు లింక్ స్కామ్‌లో రూ. 80 లక్షలు పోగొట్టుకున్న మహిళ
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా చండీఘఢ్‌కు చెందిన ఓ మహిళ నుంచి ఆధార్-సిమ్ కార్డు లింక్ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు రూ. 80 లక్షలు దోచేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నమ్మబలికిన నిందితులు మహిళను మోసగించారు.
చండీఘఢ్ సెక్టార్ 11కు చెందిన మహిళకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిని అంటూ ఓ నెంబర్ నుంచి నిందితుడు కాల్ చేశాడు. ఆమె ఆధార్ కార్డుపై జారీ అయిన సిమ్ కార్డును చట్టవిరుద్ధంగా మనీల్యాండరింగ్ కార్యకలాపాల్లో వాడుతున్నారని బెదిరించాడు. బాధితురాలిని మరింత భయపెట్టేందుకు ఆమెపై 24 మనీ ల్యాండరింగ్ ఫిర్యాదులు నమోదయ్యాయని బెదరగొట్టాడు.
బాధితురాలిని అరెస్ట్ చేస్తారని కాలర్ హెచ్చరించాడు. న్యాయపరమైన చిక్కుల్లో పడతాననే భయంతో బాధితురాలు నిందితుడు సూచనలకు అనుగుణంగా నడుచుకోవడంతో భారీ మొత్తంలో నష్టపోయారు. కేసు నుంచి తప్పించాలంటే తాను చెప్పిన బ్యాంక్ ఖాతాలో రూ. 80 లక్షలు డిపాజిట్ చేయాలని తర్వాత వాటిని రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు. నిందితుడు చెప్పినట్టు బాధితురాలు భారీ మొత్తాన్ని అతడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఆపై మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Stock Market Close | లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- cyber fraud
- loss
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

