పట్నా : ఆఫీసులో సహోద్యోగితో చాటుమాటు వ్యవహారం నడుపుతున్న భర్తను ఓ రేంజ్లో ఉతికిఆరేసిన మహిళ ఉదంతం బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. మహిళా అధికారితో తన భర్త వివాహేతర సంబంధం నడుపుతుండటంతో భగ్గుమన్న మహిళ ఏకంగా కార్యాలయంలోనే భర్తపై చెప్పులు విసిరవేసి వెంబడించి మరీ దాడి చేసింది.
భార్య నుంచి తప్పించుకునేందుకు భర్త కార్యాలయం నుంచి బయటకు పరుగులు పెట్టినా అతడిని వెంటాడి మరీ చితక్కొట్టింది. సహోద్యోగితో రాసలీలలు సాగిస్తూ తమను పట్టించుకోవడం లేదని, కుటుంబం నడిచేందుకు తనకు డబ్బులు కూడా ఇవ్వడం లేదని మహిళ వాపోయింది.
గత ఏడాదిగా భర్త ప్రవర్తనతో విసుగుచెందిన తాను పుట్టింట్లో ఉంటున్నానని, తనతో పాటు పిల్లల బాగోగులను ఆయన పట్టించుకోలేదని చెప్పారు. భర్త మొత్తం సంపాదనంతా అక్రమ సంబంధానికే తగలేస్తున్నాడని ఆరోపించింది. తండ్రి ప్రవర్తన బాగోలేదని వారి కూతురు కూడా ఆరోపణలు గుప్పించింది.
Read More :
Watch: మెట్రో రైలులో ఒక వ్యక్తి భుజంపై నిద్రించిన ప్రయాణికుడు.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే?