Watch: మెట్రోలో తన భుజంపై నిద్రించాడని.. మరీ ఇంత దారుణమా
Man Knocks Out Passenger | మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ముదరడంతో కోట్లాటకు దారి తీసింది.
వాషింగ్టన్: మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ముదరడంతో కోట్లాటకు దారి తీసింది. (Man Knocks Out Passenger) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి నిద్రపోతూ పక్కన కూర్చొన్న తోటి ప్రయాణికుడి భుజంపై తలమోపాడు. దీనిపై అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తన భుజంపై నిద్రపోయిన వ్యక్తిని మరో వ్యక్తి మోచేతితో పలుమార్లు కొట్టాడు.
కాగా, మెట్రో రైలులోని ఎదురు సీట్లో కూర్చొన్న బాధిత వ్యక్తి స్నేహితుడు దీనిపై జోక్యం చేసుకున్నాడు. దాడి చేసిన వ్యక్తితో ఫైట్ చేశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కొంతసేపు కొట్టుకున్నారు. ఇంతలో ఒక స్టేషన్లో మెట్రో రైలు ఆగింది. దీంతో బాధిత వ్యక్తి, అతడి స్నేహితుడు అక్కడ దిగిపోయారు. అనంతరం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మెట్రో రైలులో ప్రయాణం కొనసాగించిన దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు మెట్రో ట్రైన్లో ప్రయాణికులు కొట్టుకున్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz
— Rama (@EyesWitness00) August 24, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Fell Asleep
- Knocks Out
- MAN
- New York
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

