రాంచీ : భర్త జైల్లో శిక్ష అనుభవిస్తుంటే.. భార్యేమో ప్రియుడితో సరసాలు ఆడుతోంది. ఆమె అక్రమ సంబంధంపై కన్నేసిన గ్రామస్తులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని.. ఆ జంటను నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని దమ్కా జిల్లాలో వెలుగు చూసింది.
బాద్తలి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఏడాది క్రితం జైలు పాలయ్యాడు. దీంతో ఆయన భార్య ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో గ్రామంలోని ఓ యువకుడితో ఆమె గత కొంతకాలం నుంచి అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. గ్రామస్తులకు ఈ విషయం తెలియడంతో.. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు యత్నించారు.
ఇక మంగళవారం సాయంత్రం వీరిద్దరూ సరసాలు ఆడుతుండగా.. గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గ్రామంలో కిలోమీటర్ మేర ఆ జంటను నగ్నంగా ఊరేగించారు. ఇంతలోనే పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 50 నుంచి 60 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.