కొండాపూర్ : ఆఫీస్కు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని నగదుతో పాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్ భవానీపురంలో నివాసం ఉండే జైపాల్ డిసెంబర్ 21న తన విధులకు వెళ్ళాడు.
ఆరోజు రాత్రి విధుల్లో బిజీగా ఉండి ఇంటికి రాలేకపోయాడు. ఇంట్లో ఎవ్వరు లేకపోవడం, తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో పెట్టిన రూ. 2 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.
మరునాడు ఉదయం ఇంటికి వచ్చిన జైపాల్ ఇంటి తాళం పగిలి ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, ఈ మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.