60 years sentence | అమెరికాలోని మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టు ఒక వ్యక్తికి 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాలికలపై సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ఈ తీర్పును వెలువరించింది. సక్స్ ట్రాఫికింగ్ చేయడమే కాకుండా వారితో డబ్బు కూడా సంపాదించారిన ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు 60 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ మాన్‌హట్టన్ కోర్టు న్యాయమూర్తి లూయిస్ జే లైమాన్ తీర్పు చెప్పారు.
లారీ అనే వ్యక్తి 2010 లో తన కుమార్తెతో న్యూయార్క్ వచ్చి లారెన్స్ కాలేజీలో నివసించాడు. తన మాటలతో బాలికలను గందరగోళానికి గురిచేయడంతోపాటు వారిని మానసికంగా హింసించి డబ్బు సంపాదించేందుకు వాడుకోవడం మొదలు పెట్టాడు. తన సొంత కూతురిని కూడా ఇలా సెక్స్ ట్రాఫికింగ్‌లో ఇరికించేందుకు ఏమాత్రం ఆయన సంకోచించలేదు. కూతురు స్నేహితులను కూడా తన పనికి వాడుకున్నాడు. తాను చెప్పిన వారితో సంబంధం పెట్టుకోవాలని తనను బలవంత పెట్టాడని ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా చేయడం ద్వారా అతను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేవాడని కూడా తెలిపింది.
ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన మాన్‌హట్టన్ కోర్టు న్యాయమూర్తి లైమాన్.. లారీ మాయమాటలు చెప్పి బాధిత బాలికల్లో మానసిక భయాన్ని కలిగించేవాడని, ఎందరో బాలికలను తన పనులకు వాడుకున్నట్లు రుజువైందని తన తీర్పులో పేర్కొన్నాడు. బాధిత బాలికలను కొట్టి ఆకలితో అలమటించేవాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బాలికలను హింసించి సెక్స్ ట్రాపికింగ్ చేస్తూ డబ్బు సంపాదించడంపై జడ్జీ లైమాన్ స్పందిస్తూ.. నిందితుడు లారీని దుష్ట మేధావిగా పేర్కొన్నాడు.