అత్యాచార ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
అత్యాచారం, చీటింగ్ ఆరోపణలపై యూపీ మాజీ ఎమ్మెల్యే, జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ మిశ్రా కుమారుడు విష్ణు మిశ్రాను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహారాష్ట్రలోని పుణేలో అరెస్ట్ చేశారు.
లక్నో : అత్యాచారం, చీటింగ్ ఆరోపణలపై యూపీ మాజీ ఎమ్మెల్యే, జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ మిశ్రా కుమారుడు విష్ణు మిశ్రాను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహారాష్ట్రలోని పుణేలో అరెస్ట్ చేశారు. 2020 ఆగస్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు పరారీలో ఉండగా అతడి ఆచూకీ తెలిపివ వారికి రూ 25,000 అందిస్తామని ప్రకటించిన పోలీసులు ఆపై రివార్డును రూ లక్షకు పెంచారు.
ఇక నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ మిశ్రాను ఆయన బంధువు కృష్ణ మోహన్ తివారీ ఫిర్యాదు ఆధారంగా 2020లో మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. మిశ్రా తన ఆస్తిని కబ్జా చేయడంతో పాటు మోసగించాడని, చంపుతానని బెదిరించాడని తివారీ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా ప్రస్తుతం ఆగ్రా జైలులో ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arrest
- Ex MLA
- molestation
- Son
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

