ఇద్దరు మహిళా దొంగలు అరెస్టు.. రూ.24 లక్షల సొత్తు స్వాధీనం

వరంగల్ : సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) సిబ్బందితో కలిసి లింగాల ఘన్పూర్ పోలీసులు ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 473 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 24 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు నగరంలోని బుధవారిపేటకు చెందిన అక్షింతల్ సంధ్య అలియాస్ దివ్య అలియాస్ రాణి, మరో మహిళను అదే ప్రాంతానికి చెందిన బోయ కవితగా గుర్తించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో నివసిస్తున్నారు.
వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నూలులో టైలర్లుగా పనిచేసే నిందితులు రద్దీగా ఉండే ప్రదేశాలలో, ఆటోరిక్షాల్లో దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించినట్లు తెలిపారు. బస్సులలో ప్రయాణించి ప్రయాణికుల నగదు, బంగారాన్ని దొంగిలిస్తుంటారన్నారు. బోయ కవిత అనే మహిళ 2005 నుండి ఎనిమిది దొంగతనాలకు పాల్పడగా, సంధ్య 2014 నుండి 2019 వరకు రాష్ట్రవ్యాప్తంగా 16 దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. అరెస్టు వీరు బెయిల్‌పై విడుదలైనట్లు చెప్పారు. గత సంవత్సరం నుండి మరో 11 దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

