అనాగరికం : కన్యత్వ పరీక్షలో నెగ్గలేదని విడాకులు

ముంబై : కన్యత్వ పరీక్షలో విఫలం కావడంతో తమ భర్తలు తమకు విడాకులిచ్చారని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆరోపించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కన్యత్వ పరీక్షలో ఒక మహిళ కన్య కాదని తేలడంతో ఇద్దరు అక్కా చెల్లెళ్లను పుట్టింటికి పంపడం కలకలం రేపింది. కంజర్భట్ తెగకు చెందిన వీరికి గత ఏడాది వివాహమైంది. వీరిలో ఒక మహిళ కన్యత్వ పరీక్షలో విఫలమైందని అంటూ ఆమెను పుట్టింటికి పంపేందుకు భర్త అత్తమామలు సన్నద్ధమయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వీరి భర్తలు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అనాగరిక తీర్పు ఇచ్చిన జన పంచాయతి సభ్యులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెండ్లయిన కొద్దిరోజులకే కొత్త పెండ్లికూతురును భర్త సందీప్ అత్త శోభ నిత్యం వేధింపులకు గురిచేసేవారు. కొద్దిరోజుల తర్వాత బంధువుల సమక్షంలో కన్యత్వ పరీక్ష చేపట్టారు. గదిలో బెడ్ పైనా తెల్ల దుప్పటి వేసి, ఆపై దానికి రక్తపు మరకలు అంటకపోవడంతో కొత్త కోడలు కన్య కాదని వేధింపులకు పాల్పడ్డారు. పుట్టింటికి వెళ్లాలని రూ పది లక్షలు చెల్లించాలని నిత్యం చిత్రహింసలు పెట్టారు. తమ భర్తలు తమకు విడాకులచ్చినా అవి కోర్టులో చెల్లవని, కుల పంచాయతీలో మాత్రం తమ భర్తలు తిరిగి పెండ్లి చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చారని బాధిత మహిళలు ఆరోపించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

