విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరకాల పట్టణంలో పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరకాల పట్టణంలో పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు తాళ్లపల్లి కేశవ స్వామిగౌడ్(45), సంధ్యారాణి(40)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన ఈ దంపతులు ప్రార్థన కోసం పరకాలలోని ఓ చర్చికి వచ్చినట్లు తెలిసింది.
చర్చి సమీపంలో భార్య భర్తలిద్దరూ పురుగుల మందు తాగారు. వీరిలో సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందగా స్వామి గౌడ్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. కేశవ స్వామి గౌడ్, సంధ్యారాణి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

