డాలర్ల ఆశ చూపి క్యాబ్ డ్రైవర్‌కు టోకరా!

పుణే : రూ లక్ష విలువైన భారత కరెన్సీతో సమానమైన అమెరికన్ డాలర్లు ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్‌ను రూ 99,000కు ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మోసగించారు. పుణే జిల్లాలోని దత్తవాడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లొహెగావ్కు చెందిన క్యాబ్ డ్రైవర్ (60)కు డాలర్లు ఇస్తామని నమ్మబలికిన నిందితులు అతడిని రూ 99,000 తీసుకుని నీలయం టాకీస్ బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పారు. భారత కరెన్సీని అందించి రూ లక్ష విలువైన డాలర్లను తెచ్చుకునేందుకు బాధితుడు తన కుమార్తెతో కలిసి వెళ్లాడు.
నిందితులు అందించిన బ్యాగ్‌ను కొద్దిసేపటి తర్వాత తండ్రీ కూతురు దాన్ని ఓపెన్ చేయగా డాలర్లకు బదులు న్యూస్ పేపర్లు ఉండటంతో కంగుతిన్నారు. బాధితుడు వెంటనే దత్తవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి క్యాబ్‌లో ఇటీవల నిందితులు ప్రయాణించిన సమయంలో క్యాబ్ డ్రైవర్‌కు వారు 20 డాలర్ల నోటు అందించారు. డాలర్‌ను ఫారెన్ ఎక్స్ఛేంజ్ కౌంటర్లో మార్చుకోగా రూ 1400 లభించాయి. బాధితుడిని మోసగించేందుకు నిందితులు ట్రిక్‌గా దీన్ని ప్రయోగించారు. ఆపై పథకం ప్రకారం డాలర్ల ఆశచూపి బాధితుడిని రూ 99,000కు మోసగించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- dollors
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

