భార్య, ఐదుగురి పిల్లలను అతి కిరాతకంగా నరికేశాడు.. ఆపై ఆత్మహత్య
tamil nadu | గంజాయి సేవించి ఇంటికి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన భర్త, తన భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా నరికేశాడు. ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య
చెన్నై : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. పొట్టకూటి కోసం కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. కానీ ఆశించినంత పంట రాలేదు. అప్పుల పాలయ్యాడు. అంతలోనే ఆ కుటుంబంపై కరోనా విరుచుకుపడింది. దీంతో పూట గడవడం కూడా కష్టమైపోయింది. మరో వైపు ఆర్థిక కష్టాలు ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదాలు రాజుకున్నాయి. అటు ఆర్థికంగా కుదేలవడం, ఇటు ఇంట్లో గొడవలతో సతమతమవుతున్న భర్త.. గంజాయికి బానిస అయ్యాడు. నిన్న రాత్రి కూడా గంజాయి సేవించి ఇంటికి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన భర్త, తన భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా నరికేశాడు. ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరువణ్ణమలై జిల్లా పరిధిలోని ఒర్నత్తవాడి గ్రామానికి చెందిన పళనిసామి(45) వృత్తి రీత్యా రైతు. తనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు భూమి కౌలుకు తీసుకొని సాగు చేసేవాడు. అయినప్పటికీ ఆశించినంత లాభం వచ్చేది కాదు. ఇక కరోనా కూడా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పులు మరింత ఎక్కువై పోయాయి. ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అప్పు పుట్టే పరిస్థితి లేదు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో పళనిసామి గంజాయికి బానిసగా మారాడు.
ఇక నిన్న కూడా డ్రగ్స్ సేవించి ఇంటికి వచ్చిన పళనిసామి భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్యతో పాటు పిల్లలపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కుమారుడు, ఇద్దరు అమ్మాయిలు చనిపోగా, 9 ఏండ్ల వయసున్న మరో అమ్మాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను భార్య వల్లీ, కుమార్తెలు శిరీష, మనీషా, శిశశక్తి, ధనుష్‌గా గుర్తించారు. భూమిక అనే అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

