దారుణం.. వదినను హతమార్చి తగులబెట్టిన మరిది
వదినను హతమార్చిన మరిది | సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. హత్య కేసులో తనను జైలు పంపిందని కక్షగట్టిన మరిది.. వదినను దారుణం హతమార్చాడు.

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. హత్య కేసులో తనను జైలుకు పంపిందని కక్షగట్టిన మరిది.. వదినను దారుణం హతమార్చాడు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రామాపురం గ్రామానికి చెందిన రేఖ సైదులు 2004లో తన సోదరుడు రేఖ పిచ్చయ్యను హత్య చేశాడు. ఈ కేసులో మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. హత్య కేసులో తనను సంబంధం లేకున్నా ఇరికించిందని వదిన రేఖ బయమ్మ (55) పై సైదులు కక్షపెంచుకున్నాడు.
శనివారం అర్ధరాత్రి బయమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా సుత్తితో తలపై కొట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని ట్రాక్టర్లో పొలం వద్దకు తీసుకెళ్లి తగులబెట్టాడు. ఉదయం తన వదినను హత్య చేసినట్లు చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

