అయోధ్యలో కాల్పులు.. ఒకరి మృతి, ఇద్దరు బాలికలకు గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు వ్యక్తులు వాహనాల్లో వచ్చారు. పూజ మండపం వద్ద ఉన్న ఒక వ్యక్తిపై కాల్పలు జరిపారు. ఈ ఘటనలో అతడు మరణించగా, ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు గాయపడ్డారు. తొలుత వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లక్నో ఆసుపత్రికి తరలించారు.
కాల్పులు జరిపిన నలుగురిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పీ శైలేష్ పాండే చెప్పారు. దుర్గా పూజ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తా కథనాలను ఆయన ఖండించారు. వ్యక్తిగత వివాదం వల్ల ఈ ఘటన జరిగిందని, కారణం ఏమిటన్నది తెలుసుకుంటున్నామని వివరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

