Pune | భార్య, మేనల్లుడిని గన్నుతో కాల్చి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి
Pune | మహారాష్ట్ర (Maharashtra) పూణె (Pune)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
Pune | మహారాష్ట్ర (Maharashtra) పూణె (Pune)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. బానర్ (Baner) ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)గా విధులు నిర్వహిస్తుస్తున్న భరత్ గైక్వాడ్ (57) (Bharat Gaikwad).. బానర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న గైక్వాడ్.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన తుపాకీతో భార్య మోని గైక్వాడ్ (44) ను కాల్చి చంపాడు.
కాల్పుల శబ్దం రావడంతో పక్క గదిలో నిద్రిస్తున్న గైక్వాడ్ కుమారుడు, మేనల్లుడు పరుగున అక్కడికి వచ్చారు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35) పై గైక్వాడ్ గన్నుతో కాల్చాడు. దీంతో అతడి ఛాతీపై బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గైక్వాడ్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
‘సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న అతడి కుమారుడు, మేనల్లుడు పరుగున వచ్చి తలుపు తెరిచారు. దీంతో మేనల్లుడుపై గన్నుతో ఛాతీపై కాల్చాడు. ఆ తర్వాత గైక్వాడ్ తన తలపై కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, వీరి మరణానికి గల కారణాలు తెలియరాలేదని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Sudha Murty | స్టార్ నటి కారణంగా ఏడ్చేసిన సుధామూర్తి..!
Samantha | వెకేషన్లో సామ్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ..
Indonesia | ఘోర పడవ ప్రమాదం.. 15 మంది మృతి.. 19 మంది గల్లంతు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

