సిలిండర్‌లో నీళ్లు పోసి దందా.. గ్యాస్ డెలివరీ బాయ్ నిర్వాకం
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్‌లో అమ్ముతున్నాడు. వినియోగదారులు ఫిర్యాదు చేయ డంతో అసలు బాగోతం బయటపడింది
Gas Cylinder Scam : గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్‌లో అమ్ముతున్నాడు. వినియోగదారులు ఫిర్యాదు చేయ డంతో అసలు బాగోతం బయటపడింది.
జవహర్‌నగర్‌కు చెందిన కొరిపల్లి దయాకర్.. 20 ఏండ్ల నుంచి హెచ్‌పీ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సిలిండర్ల నుంచి గ్యాస్‌ను తీసి, ఖాళీ సిలిండర్లలో రీ-ఫిల్లింగ్ చేసే సామగ్రిని సేకరించుకొన్నాడు. రోజువారీగా డెలివరీ ఇవ్వాల్సిన సీల్డ్ సిలిండర్లను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. తన వద్ద ఉన్న ఖాళీ సిలిండర్ వాల్వ్ మొత్తం తీసేసి అందులో 12 కిలోల బరువు వచ్చే వరకు దాదాపు 10 లీటర్ల నీళ్లు పోసి వాల్వ్ బిగిస్తాడు. తర్వాత నిండు గ్యాస్ సిలిండర్‌పై ఉండే తెలుపు రంగు క్యాప్, స్టిక్కర్ పాడవకుండా తీస్తాడు. చిన్న ప్రెషర్ పైప్‌తో నిండు సిలిండర్ నుంచి ఖాళీ సిలిండర్‌లోకి గ్యాస్‌ను నింపుతాడు.
సిలిండర్ బరువు 14.2 కిలోలు వచ్చే వరకు గ్యాస్ నింపి, వాటిని బ్లాక్‌లో రూ.వెయ్యికి డెలివరీ చేస్తున్నాడు. 3, 4 రోజుల పాటు వినియోగించాక స్టవ్ వెలగకపోవటంతో వినియోగదారులు కంగుతిన్నారు. డిస్ట్రిబ్యూటర్‌కు ఫిర్యాదు చేస్తే గ్యాస్ మెకానిక్‌ను పంపించారు. వారికి కూడా తొలుత సమస్య అర్థం కాలేదు. గ్యాస్ సిలిండర్లను బోర్లా పడేసి చూస్తే అందులోంచి నీళ్లు వచ్చాయి. అనుకోకుండా నీళ్లు వెళ్లి ఉంటాయని భావించి వాటిని డిస్ట్రిబ్యూటర్ రీప్లేస్ చేశాడు. రెండు నెలల్లోనే దాదాపు 282 సిలిండర్లు వెనక్కి రావటంతో డిస్ట్రిబ్యూటర్లు పోలీసులను ఆశ్రయించారు. కొందరు వినియోగదారుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో రాచకొండ ఎస్వోటీ పోలీసులు సోదాలు నిర్వహించగా, దయాకర్ వ్యవహారం బయటపడింది. మరో ఇద్దరికి మద్యం, బిర్యానీలు, చేతి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి సహాయకులుగా పెట్టుకొని, నిందితుడు అక్రమ దందా చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇటీవల ముగ్గురిని అరెస్టు చేశారు.
అక్రమ రీ-ఫిల్లింగ్‌పై సమాచారం ఇవ్వండి
దయాకర్ వ్యవహారంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్ రీఫిల్లింగ్ చేసే సమయంలో చిన్న నిప్పు రవ్వ పడినా, షార్ట్ సర్క్యూట్ అయినా అక్కడ భారీ ప్రమాదం సంభవించేదని తెలిపారు. ఎవరైనా ప్రమాదకర రీతిలో, అక్రమంగా గ్యాస్ రీ-ఫిల్లింగ్ చేస్తే డయల్ 100కు లేదా రాచకొండ పోలీసుల వాట్సాప్ నంబర్ 9490617111కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

