న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సరోజిని నగర్లో రష్యన్ యూట్యూబర్ (Russian YouTuber) షూట్ చేస్తుండగా నిందితులు వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్యన్ మహిళతో మాట్లాడేందుకు వ్యక్తి ప్రయత్నించడం కనిపించింది.
తనను స్నేహితుడిగా కోరుతున్నారా అని అతడు యూట్యూబర్‌ను అడగడం వినిపించింది. దీంతో ఆమె అతడికి దూరంగా వెళ్లగా, సదరు వ్యక్తి ఆమెను వెంబడించాడు. మీరెవరో తనకు తెలియదని మహిళ బదులిచ్చినా అతడు ఆమెను అనుసరిస్తూ మనం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒకరికి ఒకరు తెలుస్తామని చెబుతాడు.
తనకు ఎలాంటి కొత్త స్నేహితుల అవసరం లేదని బదులిస్తుంది. ఆపై మీరు చాలా సెక్సీగా ఉన్నారని అనడంతో ఆమె అసౌకర్యంగా ఫీలవుతుంది. ఈ వీడియోను కోకో యూట్యూబ్ చానల్‌గా అప్లోడ్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
Read More :
Trivikram Son | డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న త్రివిక్రమ్ కొడుకు..!