హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పంగలా గ్రామంలో న్యూడ్ డాన్స్ ఈవెంట్ నిర్వహించారు. కొంత మంది అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు కలిసి నగ్నంగా డ్యాన్సులు చేయించారు. పోలెరమ్మ జాతర సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఈవెంట్ నిర్వహించారు.
అయితే కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని న్యూడ్ డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించిన వారితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.