మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 15:57:38

ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న పీఎస్‌సీ ర్యాంక్‌ హోల్డర్‌

ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న పీఎస్‌సీ ర్యాంక్‌ హోల్డర్‌

తిరువనంతపురం (కేరళ) : పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) పరీక్షలో 77వ ర్యాంకు సాధించిన యువకుడు ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాలు.. తిరువనంతపురం జిల్లా కరకోణంలో నివసిస్తున్న అను (28)కు ఇటీవల నిర్వహించిన పీఎస్‌సీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు వచ్చింది.. అయినా అతడికి ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.  ఉద్యోగం రావట్లేదని అను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇదిలా ఉండగా పీఎస్‌సీలో ర్యాంకు సాధించిన వారిని పక్కకు పెట్టి నియామకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ మరణానికి కారణమని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాలా మృతుడి ఇంటిని సందర్శించి నివాళులర్పించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo