పేదరికంతో వేగలేక పేగుబంధంతో రాజీ : మూడు రోజుల పసికందును రూ 1.78 లక్షలకు అమ్మేసింది!

ముంబై : పేదరికంతో తల్లడిల్లిన తల్లి మూడు రోజుల పసికందైన తన కన్నకొడుకును ముంబైలోని ఓ వ్యక్తికి రూ 1.78 లక్షలకు అమ్మిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షిర్డీలో వెలుగుచూసింది. ఈ ఘటనలో మహిళతో పాటు ఆమెకు సహకరించిన నలుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డొంబివిలిలోని మన్పడ పోలీస్ స్టేషన్లో నవంబర్ 7న దాఖలైన ఎఫ్ఐఆర్ ప్రకారం..సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తమ కుటుంబం పేదరికంలో మగ్గుతుండటంతో శిశువును పోషించలేకపోయింది.
దీంతో శిశువును విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ఆమె తగిన కస్టమర్ కోసం వెతుకుతోంది. ఈ విషయంలో అహ్మద్‌నగర్, థానేకు చెందిన కళ్యాణ్, ముంబైలోని ములుంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఆమెకు సహకరించారు. ములుంద్‌లో నివసించే వ్యక్తికి ఎలాంటి చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తిచేయకుండానే వారు రూ 1.78 లక్షలకు శిశువను విక్రయించారు. ఈ విషయమై సమాచారం అందడంతో వ్యక్తి ఇంటిపై దాడులు చేపట్టగా శిశువు కనిపించాడు. దీంతో నేరానికి పాల్పడిన పసిబిడ్డ తల్లి సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

