Traffic Challan fraud | ట్రాఫిక్ చలాన్ పేరుతో రూ.60,000 దోచుకున్న మోసగాళ్లు.. అదెలాగంటే..
Traffic Challan fraud | ఆన్లైన్లో కేవలం రూ.400ల ట్రాఫిక్ చలాన్ చెల్లించబోయిన ఒక వ్యక్తి ఏకంగా రూ. 60,000 పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.

ఆన్లైన్లో కేవలం రూ.400ల ట్రాఫిక్ చలాన్ చెల్లించబోయిన ఒక వ్యక్తి ఏకంగా రూ. 60,000 పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
ముంబైకి చెందిన వకాసే అనే ఒక బస్ డ్రైవర్ తను నడిపే ఫోర్ వీలర్‌పై ఉన్న ట్రాఫిక్ చలానాని అన్లైన్లో కట్టాడు. కానీ చలానా చెల్లింపు జరిగినట్లు తన ఫోన్‌కి మెసేజ్ రాకపోవడంతో వకాసే ఆ వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తి వకాసేకు కలిగిన ఇబ్బంది విని.. అతను చేసిన చెల్లింపు గురించి వివరాలు అడిగాడు. ఈ క్రమంలో వకాసే నుంచి అతని డెబిట్ కార్టు నెంబర్, ఫోన్లో వచ్చిన ఒటిపిని కూడా చెప్పమన్నాడు.
వకాసే ఆ వ్యక్తి చెప్పినట్లు చేశాడు. కాసేపు తరువాత వకాసే అకౌంట్ నుంచి రూ.60,000 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన వకాసే మళ్లీ అదే కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేశాడు. కానీ ఈ సారి ఎవరూ కాల్ రిసీవ్ చేయలేదు. ఏం చేయాలో తెలియక వకాసే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వకాసే చెల్లించిన చలాన్ వెబ్సైట్ నకిలీదని చెప్పి కేసుని సైబర్ క్రైం విభాగానికి అప్పగించారు.
ఇలాంటి అన్లైన్ చెల్లింపులు చేసే సమయంలో బ్యాంకు నుంచి, లేదా చెల్లింపు తీసుకునే ఏ ఇతర సంస్థ కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్వర్డ్, ఒటిపి వంటి వివరాలు అడగరని.. ఒకవేళ ఎవరైనా అడిగినా చెప్పకూడదని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- debit card
- fraud
- online
- OTP
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

