Crime news : రైలు ఢీకొని వృద్ధుడు మృతి..
Crime news | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది.

కాచిగూడ,సెప్టెంబర్ 2 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హయత్‌నగర్, బృందావన్ కాలనీకి చెందిన రామయ్య కుమారుడు వి.ముత్యాలు(72) గురువారం సాయంత్రం మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

