అనుచితంగా తాకిన వ్యక్తిని.. చితక్కొట్టిన మహిళ

నోయిడా: అనుచితంగా తాకి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఒక మహిళ చితకబాదింది. నోయిడాలోని సహారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నోయిడాలోని సెక్టార్ 12 వద్ద ఉన్న పెట్రోల్ బంకులో 24 ఏండ్ల మహిళ ఆరేండ్లుగా పని చేస్తున్నది. శుక్రవారం ఉదయం ఆమె రోడ్డుపై నడిచి డ్యూటీకి వస్తున్నది. ఇంతలో సైకిల్ తొక్కుతున్న 40 ఏండ్ల వ్యక్తి ఆమె ముందు భాగాన్ని తాకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
వెంటనే స్పందించిన ఆ మహిళ అతడి సైకిల్ వెంటపడి నిలువరించి పట్టుకున్నది. అనంతరం అతడి చెంప చెళ్లుమనిపించడంతోపాటు దేహశుద్ధి చేసింది. దీంతో అతడు క్షమించమని వేడుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మరోవైపు అక్కడ గుమిగూడిన స్థానికులు తమ మొబైల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Chase
- Molester
- Noida woman
- Slap
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

