Firing | షాపులోకి దూసుకొచ్చి కాల్పులు జరిపిన దుండగులు
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు బైక్‌పై షాపు వద్దకు రాగా ఇద్దరు వ్యక్తులు షాపులోకి దూసుకొచ్చి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఆ సమయంలో షాపు తెరిచిఉన్నా ఫ్రంట్ గ్లాస్ డోర్స్పైకి దుండగులు కాల్పులు జరిపారు. ఘటనా స్ధలం నుంచి పారిపోయే ముందు వారు గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఫైరింగ్‌పై పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
షాపు యజమాని, ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read More :
Sonia Gandhi | మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఏమన్నారంటే..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Delhi
- Firing
- Miscreants
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

