హాస్పిటల్ టాయిలెట్లో ప్రసవించి.. ఫ్లష్ చేసిన రేప్ బాధితురాలు

తిరువనంతపురం: లైంగిక దాడి బాధితురాలు ఈ విషయాన్ని దాచింది. గర్భం దాల్చిన ఆమె ఆరు నెలల తర్వాత ఆసుపత్రి టాయిలెట్లో నెలలు నిండని పిండాన్ని ప్రసవించింది. అనంతరం టాయిలెట్లో పడేసి ఫ్లష్ చేసింది. కేరళలోని కొచ్చిలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఒక మైనర్ బాలిక తల్లితో కలిసి చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. వారి వంతు కోసం వేచి ఉండగా ఆ బాలిక ఆసుపత్రిలోని టాయిలెట్‌కు వెళ్లింది. పూర్తిగా పెరుగని ఆరు నెలల పిండాన్ని ప్రసవించింది. ఆ తర్వాత పిండాన్ని టాయిలెట్ బేసిన్లో పడేసి ఫ్లష్ చేసి బయటకు వచ్చింది. అనంతరం ఆ టాయిలెట్లోకి వెళ్లిన వ్యక్తి బేసిన్లో ఇరుకున్న పిండాన్ని చూసి ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు వచ్చి పరిశీలించారు.
దర్యాప్తు తర్వాత ఇది మైనర్ బాలిక పనిగా గుర్తించారు. ఆమెను దీనిపై ప్రశ్నించగా ఆరు నెలల కిందట 20 ఏండ్ల వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని అన్నది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వయనాడ్‌కు చెందిన నిందితుడ్ని గురువారం అరెస్ట్ చేసి కొచ్చికి తీసుకొచ్చారు. పోక్సో కోర్టులో అతడ్ని ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

