దారుణం : పనిమనిషిపై యజమాని సహా ఇద్దరు వ్యక్తుల లైంగిక దాడి
హర్యానాలో దారుణం వెలుగుచూసింది. ఇంట్లో పనిచేసే 16 ఏండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకువచ్చింది.
గురుగ్రాం : హర్యానాలో దారుణం వెలుగుచూసింది. ఇంట్లో పనిచేసే 16 ఏండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకువచ్చింది. 2020 జూన్‌లో ఈ ఘటన జరగ్గా బాధితుడు కుటుంబసభ్యులకు ఈ విషయం వెల్లడించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడి యజమానితో పాటు అతడి ఇద్దరు స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. నీచమైన నేరానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారని గురుగ్రాం పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని రాజస్ధాన్‌కు పంపామని చెప్పారు.
ఈ ఘటన అనంతరం తీవ్ర వేదనకు గురైన బాధితుడు సాయం కోసం యజమాని స్నేహితుడిని ఆశ్రయించగా అతడు కూడా లైంగిక వేధింపులకు దిగాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నామని బాధితుడు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితుడికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తుండగా నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- domestic help
- men
- molestation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

