ప్రేయసిపై కసి : విష రసాయనాలకు ఆర్డర్ ఇస్తూ దొరికిపోయాడు!

న్యూయార్క్ : అనధికార లావాదేవీలు, చీకటి కార్యకలాపాలు, మోసాలకు వేదికైన డార్క్ వెబ్ నేరాలకు అడ్డాగా మారుతోంది. తనతో రొమాన్స్‌కు నిరాకరించిందని మహిళను టార్గెట్ చేస్తూ హానికారక కెమికల్స్‌ను ఆర్డర్ చేసిన మిస్సోరికి చెందిన జేసన్ సిస్సెర్ (46)కు యూఎస్ కోర్టు 12 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఎవరి కంటపడకుండా డార్క్‌వెబ్‌లో ఆర్డర్ ఇచ్చి క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు చెల్లించినా జేసన్‌కు ఊచలు లెక్కబెట్టడం తప్పలేదు. బిట్‌కాయిన్ ద్వారా జేసన్ చెల్లింపులు జరపగా ఆర్డర్ కన్ఫర్మేషన్ ప్రక్రియ అతడి అరెస్ట్‌కు దారితీసింది.
జేసన్ తాను మైనర్‌గా పేర్కొంటూ 2018 జూన్, ఆగస్ట్ల మధ్య కాడ్మిమ్ అర్సెనైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మరికొన్ని ఇతర కెమికల్స్ ఐదు బ్యాచ్‌లకు ఆర్డర్ ఇచ్చాడు. ఈ హానికారక కెమికల్స్ 300 మందిని పైగా చంపేందుకు సరిపోతాయని అధికారులు నిర్ధారించారు. తన ఉనికిని దాచి నేరానికి పాల్పడటంతో పాటు రసాయన ఆయుధాలను సేకరించినందుకు జేసన్ సిస్సెర్ను ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. జేసన్ ఉదంతంతో డార్క్ వెబ్ కార్యకలాపాల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. డార్క్ వెబ్‌లో మార్కెట్ ప్లేస్‌లపై ఉక్కుపాదం మోపాలని సైబర్ నిపుణులు, సామాజికవేత్తలు కోరుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- chemicals
- Crime news
- Darknet
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

