ముగ్గురమ్మాయిల తర్వాత కొడుకు పుట్టాడని.. యువకుడిని బలిచ్చాడు..
భోపాల్ : ఓ ఇద్దరు దంపతులకు వరుసగా ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. తమకు కుమారుడు కావాలన్న కలగానే మిగిలిపోయింది వారికి. తమకు ఎలాగైనా కుమారుడిని ప్రసాదించాలని దేవుళ్లను వేడుకున్నారు. ఒక వేళ నాలుగో కాన్పులో అబ్బాయి జన్మిస్తే.. ఓ యువకుడిని బలిస్తామని అమ్మవారిని ప్రార్థించారు. యాధృచ్చికంగా ఆ దంపతులకు కుమారుడు జన్మించడంతో.. మొక్కు నెరవేర్చుకునేందుకు ఓ యువకుడిని బలిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రెవా జిల్లాలోని సర్మౌర్ పోలీసు స్టేషన్ పరిధిలో జులై 6న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
రామ్లాల్ ప్రజాపతి తన భార్యతో కలిసి సర్మౌర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముంటున్నాడు. అయితే వారికి వరుసగా ముగ్గురు అమ్మాయిలు జన్మించారు. నాలుగో కాన్పులో అయినా మగబిడ్డ కావాలని అమ్మవారిని ప్రార్థించారు. అబ్బాయి జన్మిస్తే.. ఓ యువకుడిని బలిస్తామని మొక్కారు. అయితే ప్రజాపతి భార్య గత నెలలో మగ శిశువుకు జన్మనిచ్చింది. అమ్మవారిని ప్రార్థించినందుకే అబ్బాయి పుట్టాడని భావించిన ప్రజాపతి.. యువకుడి కోసం వేట ప్రారంభించాడు.
తన పొరుగు గ్రామానికి చెందిన ఓ 19 ఏండ్ల యువకుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి తన గ్రామంలోని అమ్మవారి ఆలయంలో యువకుడిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. మరుసటి రోజు ఉదయం యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జులై 6వ తేదీన ప్రజాపతి వెంట ఆ యువకుడు తిరిగినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

