వీడియో: 9వ అంతస్తు పైనుంచి కింద పడిన మహిళ

లక్నో: ఒక మహిళ 9వ అంతస్తు పైనుంచి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది. రెసిడెన్సియల్ సొసైటీలోని అపార్ట్మెంట్ సముదాయంలో నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య మంగళవారం వాదన జరిగింది. ఈ నేపథ్యంలో భార్య 9వ అంతస్తులోని బాల్కానీ నుంచి కిందకు దూకబోయింది. అప్రమత్తమైన భర్త వెంటనే స్పందించి ఆమె చేయి పట్టుకున్నాడు. భార్యను సురక్షితంగా పైకి చేర్చేందుకు అతడు ప్రయత్నించాడు. మరోవైపు రెసిడెన్సియల్ సొసైటీ వారు ముందు జాగ్రత్తగా కింద పరుపులు ఏర్పాటు చేశారు.
అయితే మూడు నిమిషాల తర్వాత భర్త చేతిపట్టు నుంచి జారిన భార్య, 9 అంతస్తుల ఎత్తు నుంచి కింద ఏర్పాటు చేసిన పరుపులపై పడింది. తీవ్రంగా గాయపడి బతికే ఉన్న ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగింది అన్నది అడిగి తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు. మరోవైపు స్థానికంగా ఉన్న ఒకరు తీసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ग़ाज़ियाबाद में पति से झगड़े के बाद एक महिला ने 9वीं मंज़िल से छलांग लगाई,पति ने 3 मिनट तक हाथ पकड़कर रखा और शोर मचा दिया,शोर सुनकर नीचे लोगों ने गद्दे बिछा दिए,पकड़ कमजोर पड़ते ही महिला नीचे गिरी और गंभीर से घायल हो गई pic.twitter.com/6WPYzEMI3A
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 15, 2021
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

