బెంగళూర్ : లైంగిక ఉద్దీపనలను పెంచే మందులు కొనుగోలు చేసినందుకు భారీ బహుమతి గెలుచుకున్నారని ఓ వ్యక్తికి రూ 2.17 లక్షల మేర సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన బెంగళూర్‌లో వెలుగుచూసింది. బెంగళూర్ శివార్లలోని బెల్లందూర్‌లో ఆటోడ్రైవర్ అయిన బాధితుడికి రెండు వేర్వేరు మొబైల్ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి. లైంగిక సామర్ధ్యాన్ని పెంచే మందులను కొనుగోలు చేసినందుకు ఆయనకు భారీ నగదు బహుమతి వచ్చిందని నేరగాళ్లు నమ్మబలికారు.
ఈ గిఫ్ట్‌కార్డును పొందాలంటే కొంతమొత్తం పన్నులు, ఇతర చార్జీల కోసం చెల్లించాలని చెప్పారు. అయితే కొద్దిరోజుల్లోనే నేరగాళ్లు తన ఖాతా నుంచి రూ 2.17 లక్షలు కాజేయడంతో తాను మోసపోయానని బాధతుడు గ్రహించాడు. వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం కింద నేరగాళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా ఇదే తరహాలో 2019లో ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసిన వ్యక్తి ఖాతా నుంచి స్కామర్లు రూ 95,000 లూటీ చేశారు.