లక్నో: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఒక వ్యక్తి అక్రమ విద్యుత్ లైన్‌ను తొలగించబోయి అధికారికి అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ చోరీపై తనిఖీ చేసేందుకు అధికారులు ఒక వ్యక్తి ఇంటికి వచ్చారు. గమనించిన ఆ వ్యక్తి అధికారుల కంటబడకుండా మెల్లగా మెట్లపై పాకుతూ టెర్రస్‌పైకి చేరాడు. ఇటుకల కింద ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్ వైర్‌ను కట్ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. ఇంతలో పక్క ఇంటి డాబాపై ఉన్న విద్యుత్ అధికారి ‘నేను ఇక్కడే ఉన్నా‘ అని అనడంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. మరోవైపు ఆ అధికారి తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ग़ाज़ियाबाद में जब एक कटियाबाज़ के यहां बिजली विभाग का छापा पड़ा तो वो रेंगते हुए अपना अवैध कनेक्शन काटने गया,जिससे उसे कोई देख न पाए,लेकिन बिजली विभाग एक कर्मचारी उससे 2 कदम आगे निकला,वो पहले ही बगल वाले कि छत से वीडियो बना रहा था,फिर क्या हुआ देखिये pic.twitter.com/3Gs5rDIneD
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 13, 2021