హైదరాబాద్ : వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి మహిళకు అశ్లీల వీడియోలు పంపిన 58 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హైదరాబాద్ బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన రైజుద్దీన్గా గుర్తించారు. నిందితుడిని షీటీమ్స్ బృందం అదుపులోకి తీసుకుంది.
రైజుద్దీన్ గత కొంతకాలంగా ఫేస్బుక్ ఖాతాలో మహిళల ఐడీలను గుర్తించి టార్గెట్‌గా ఎంపిక చేసుకున్న వారి ఫోన్ నెంబర్లను సేకరిస్తుంటాడు. ఆపై వారికి అశ్లీల వీడియోలను షేర్ చేస్తూ వేధిస్తున్నాడు. గత కొద్దినెలలుగా నిందితుడు మూడు వేర్వేరు నెంబర్ల నుంచి ఐదుగురికి పైగా మహిళలకు అశ్లీల వీడియోలు పంపుతున్నట్టు దర్యాప్తులో తేలిందని షీటీమ్స్ అధికారి తెలిపారు.
బాధితులు నిందితుడిని నెంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నెంబర్ నుంచి వీడియోలను పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించారు. నిందితుడి ఆగడాలను భరించలేని ఓ బాదితురాలు షీ టీంను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. బోయిన్పల్లి పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు రైజుద్దీన్ను అరెస్ట్ చేసిన షీటీమ్స్ బృందం తదుపరి దర్యాప్తు నిమిత్తం బోయిన్పల్లి పోలీసులకు అప్పగించింది.