అమరావతి : ఏపీలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident,) న్యాయవాది మృతి ( Advocate Died ) చెందాడు. కృష్ణా జిల్లా విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగాపామర్రు మండలం మలయప్పన్ పేట వద్ద జాతీయ రహదారిపై రెండు కార్లు, బైకు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో న్యాయవాది దాసరి అజయ్‌కుమార్ ( Dasari Ajaykumar )దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.