Hyderabad | కేటీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదు : దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్ : మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లి కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ ఎండీ జహీర్‌ఖాన్, జిల్లా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు పాండుగౌడ్లను మోహన్‌నగర్‌లోని జహీర్‌ఖాన్ నివాసానికి వెళ్లి సుధీర్‌రెడ్డి పరమార్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన టీఆర్ఎస్వీ నాయకులపై దాడిని ఆయన ఖండించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డీ. జహీర్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌పై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. రేవంత్‌రెడ్డి మరోసారి కేటీఆర్‌పై తప్పుడు వాఖ్యలు చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.
తమపై దాడి చేసిన గుండాలను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాల్గౌడ్, టీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గుండుమల్ల పాండుగౌడ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు, ఎల్బీనగర్ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఎం.డి. షఫీ, నాయకులు బొగ్గారపు వరుణ్‌చంద్ర, శివప్రకాష్, రమాకాంత్, అక్షయ్, పులికంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

