జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడి హత్య..!
inter student murder | నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని
హైదరాబాద్ : నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఏఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్ ముక్తాజాపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ముక్తాజాను అక్కడనే ఉన్న పలువురు ప్రైవేటు ఆస్పతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కార్పొరేటర్ ఆజం షరీఫ్ సోదరి కొడుకే ముక్తాజా. మృతుడు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. అయితే, స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణమని తెలుస్తున్నది. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ముర్తుజాపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంటనే సయ్యద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

