రెండో భార్యపై అనుమానం : మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో కడతేర్చాడు!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం నరేలా పారిశ్రామికవాడలో కలకలం రేపింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం నరేలా పారిశ్రామికవాడలో కలకలం రేపింది. నిందితుడు రిషి తన రెండో భార్య మమతను తొలి భార్య బేబీ, ఫ్రెండ్ సాయంతో కడతేర్చాడని వెల్లడైంది. మమత ప్రవర్తనతో విసుగు చెందిన తాము ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నామని నిందితుడి మొదటి భార్య బేబి పోలీసులకు తెలిపింది.
మృతురాలు మమతపై రిషీ ఫ్రెండ్ కరణ్ లైంగిక దాడి జరిపి ఆపై ఊపిరిఆడకుండా చేసి ఉసురు తీశాడని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. నరేలాలోని పంజాబీ కాలనీ వద్ద ప్రభుత్వ పాఠశాల సమీపంలో మహిళ మృతదేహం పడిఉందని ఏప్రిల్ 18న పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఆపై ప్రత్యక్ష సాక్షులను విచారించగా రిషీ సహోద్యోగి రాకేష్ కీలక సమాచారం అందించాడు.
ఏప్రిల్ 16 రాత్రి మంగళ్ బజార్ ప్రాంతంలో రిషీ, మమతలను చూశానని చెప్పాడు. మరుసటి రోజు ఫ్యాక్టరీకి వచ్చిన రిషీ తాను కుటుంబ గొడవలతో మమతను గురుగ్రాంలోని వారి బంధువుల ఇంటికి పంపానని చెప్పాడని వివరించాడు. మరుసటి రోజు ఫ్యాక్టరీకి రాకపోవడంతో తాను రిషీకి ఫోన్ చేయగా మమతను కరణ్ సాయంతో చంపేశానని అంగీకరించాడని చెప్పాడు. మమత, రిషీ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, మమత పట్ల అసూయతో రగిలిన బేబి హత్యకు పురిగొల్పిందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడు రిషిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- MAN
- second wife
- spouse
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

